ఈ ఏడాది రుతు పవనాలు ముందుగా ప్రవేశించనున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. గతం కంటే నాలుగు రోజులు ముందే నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రేపు అండమాన్ నికోబార్ దీవుల్ని నైరుతి రుతు పవనాలు తాకనున్నాయి. గత ఏడాది మే 30వ తేదీ తాకాయి. అదే సమయంలో ఈ నెల 27వ తేదీన కేరళను తాకనున్నాయి. గత ఏడాది నైరుతి రుతు పవనాలు కేరళను మే 30వ తేదీన తాకాయి. కానీ గత ఏడాది నైరుతి రుతు పవనాలు చురుగ్గా లేకపోవడంతో వర్షపాతం ఆశించినంతగా నమోదు కాలేదు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితులు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉన్న ద్రోణి నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదిలేందుకు దోహదపడనున్నాయి. అందుకు అనువైన పరిస్థితులు కలగనున్నాయి. ఎల్‌నినో పరిస్థితులు లేకపోవడంతో ఈసారి గతం కంటే అధిక వర్షపాతం నమోదు కానుందని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 105 శాతం వర్షపాతం నమోదు కానుందని అంచనా.
రేపు అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
May 12, 2025
0
Tags