ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులతోపాటు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలో భద్రతా దళాలు తారసపడడంతో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు సైతం వెంటనే స్పందించి కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇరు వైపులా కొన్ని గంటల పాటు హోరా హోరీగా కాల్పులు జరిగాయి. అనంతరం మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. దాంతో భద్రతా దళాలు పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టాయి. అందులోభాగంగా ఆ ప్రాంతంలో 20 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు కనుగోన్నాయి. అయితే పలువురు మావోయిస్టులు పారిపోయినట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఆ క్రమంలో కూంబింగ్ చేపట్టాయి. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో మవోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఇంకోవైపు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్‌లో 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)