ఢిల్లీలో భారీ వర్షాలకు పోలీస్ స్టేషన్‌ పైకప్పు కూలి ఎస్ఐ దుర్మరణం

Telugu Lo Computer
0


ఢిల్లీలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఘజియాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ పైకప్పు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఆ స్టేషన్ ఎస్ఐ దుర్మరణం పాలయ్యాడు. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్‌లో వీరేంద్ర మిశ్రా (58) ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వర్షం, పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కూలిపోయింది. శిథిలాలు మీదపడటంతో తీవ్ర గాయాలపాలై మిశ్రా మరణించారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల మేరకు ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు 81.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మోతీబాగా, మింట్ రోడ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)