మహారాష్ట్రలోని థానే నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్స పొందుతూ మరణించినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితిపై మరింత అప్రమత్తతను పెంచింది. ముంబ్రాకు చెందిన ఈ 21 ఏళ్ల యువకుడు మే 22, 2025న థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ కల్వా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ వారం గ్రేటర్ ముంబైలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయి మరణించిన నాల్గవ వ్యక్తి ఈ యువకుడు. ఈ నలుగురికి కూడా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు.
థానే నగరంలో కరోనాతో యువకుడు మృతి
May 25, 2025
0
Tags