ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం తెలుగు చిత్ర పరిశ్రమపై శనివారం సంచలన ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉప ముఖ్యమంత్రి పవన్ పేషీ విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేరకు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ' ఆ నలుగురు అంటూ వార్తలు రాయడం సరికాదు. ఆ నలుగురి నుంచి నేను బయటకు వచ్చేశా. నా దగ్గర చాలా థియేటర్లు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర కేవలం 15లోపు థియేటర్లే ఉన్నాయి. మిగిలిన థియేటర్లు వదిలేశా. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. థియేటర్లకు సంబంధించి మూడు మీటింగ్స్‌కు నేను వెళ్లలేదు. ఆ నలుగురు అంటూ నన్ను కలపొద్దు' అని అన్నారు.
ఆ నలుగురు అంటూ నన్ను కలపొద్దు : అల్లు అరవింద్
May 25, 2025
0
Tags