భారత్‌ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదు : కేంద్రమంత్రి జైశంకర్‌

Telugu Lo Computer
0


కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆపరేషన్‌ సిందూర్‌పై ఆస్ట్రియా విదేశాంగశాఖ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడుల గురించి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని భారత్‌ ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి, అణ్వస్త్ర బెదిరింపులకు వ్యతిరేకమనే అంశాలపై ఇరువురు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు జైశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం గురించీ తాము చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే మంగళవారం జైశంకర్‌ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌ ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదని వారికి తెలియజేశారు. ఇతర ప్రపంచ దేశాల ప్రతినిధులతో చర్చించారు. పాక్‌పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి మద్దతు కొనసాగించాలని కోరారు. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాక్‌పై భారత్‌ చేపట్టిన చర్యల గురించి చైనా, అమెరికా, జపాన్‌, జర్మనీ, యూకే, రష్యా వంటి 70 దేశాల దౌత్యాధికారులకు భారత్‌ వివరించింది. ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌ వేసిన ముందడుగు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వివరాలను వారికి తెలియజేసింది.  

Post a Comment

0Comments

Post a Comment (0)