ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్‌సైట్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు. ఈ బగ్ ద్వారా, ఎవరైనా నాసా అధికారిక ఇమెయిల్ నుండి నకిలీ సందేశాలను పంపవచ్చు. ఎంతోమంది సైబర్ నిపుణులు ఈ లోపాన్ని పట్టుకోలేకపోయారు, కానీ యువరాజ్ దాన్ని గుర్తించడం విశేషంగా నిలిచింది. fy"> NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో దాదాపు రెండు వారాల పాటుప్రయత్నించిన , ఇక ఆశ వదిలేసుకుంటున్న సమయంలో ఒక రాత్రి అతను నాసా సబ్ డొమైన్‌లో లోపాన్ని కనుగొన్నాడు. దీనిపై సమగ్ర నివేదికను తయారు చేసి వీడియోతో పాటు నాసాకు పంపించాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, రహస్య సమాచారాన్ని చేరవేసే బగ్‌ల గురించి తెలియజేశాడు. యువరాజ్ గుప్తా సాధించిన ఈ ఘనతకు నాసా గురించింది. యువరాజ్‌ను ప్రశంసా పత్రం , 'హాల్ ఆఫ్ ఫేమ్'లో స్థానం కల్పించి సత్కరించింది. కాన్పూర్‌లోని సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో చదువుతున్నాడు . 10వ తరగతిలో 79.4 శాతం మార్కులు సాధించాడు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, అతను యూట్యూబ్, ఆన్‌లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా ఎథికల్ హ్యాకింగ్‌పై పట్టు సాధించాడు. 6వ తరగతిలో ఉన్నప్పటినుంచీ సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. పట్టుదల కుండా ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యాన్ని సాధించాడు. తాజాగా తన నైపుణ్యంతో నాసాను ఇంప్రెస్ చేయడం విశేషం. యువరాజ్ గుప్తా తండ్రి జై నారాయణ్ గుప్తా ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. తల్లి కల్పనా గుప్తా గృహిణి.
నాసా వెబ్‌సైట్‌ను సైబర్ దాడుల నుండి రక్షించిన యువరాజ్ గుప్తా
May 26, 2025
0
Tags