మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌ విజేతగా భారత్‌

Telugu Lo Computer
0


కొలంబోలో జరిగిన దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌ మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా టీమ్‌ఇండియా నిలిచింది. సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 343 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 48.2 ఓవర్లలో 245 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో చమరి ఆటపట్టు (51) అర్ధశతకం సాధించింది. నీలాక్షి (48), విష్మి (36) రాణించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా 4, అమన్‌జ్యోత్‌ 3 వికెట్లు తీశారు. శ్రీచరణి ఒక వికెట్‌ పడగొట్టింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా బ్యాటర్లలందరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (116; 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో ఆకట్టుకుంది. హర్లీన్‌ డియోల్ (47; 56 బంతుల్లో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41; 30 బంతుల్లో), జేమీమా రోడ్రిగ్స్ (44; 29 బంతుల్లో), ప్రతీకా రావల్ (30) రాణించారు. అమన్‌జ్యోత్ కౌర్ (18), రిచా ఘోష్ (8), దీప్తి శర్మ (20*) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దేవ్మీ విహంగా 2, సుగందికా కుమారి 2, మదార 2, ఇనోకా రణవీర ఒక వికెట్ పడగొట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)