భారత్-పాక్ ఉద్రిక్తతలు చల్లారడంతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ఈ నెల 15 నుంచి లీగ్ మళ్లీ మొదలు కానుంది. అసలు షెడ్యూల్ ప్రకారం మే 15న ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యన ముంబైలో మ్యాచ్ జరగాల్సి ఉంది. మరి ఈ మ్యాచ్ నుంచి నిర్వహణ మొదలుపడతారా? లేక మే 8న ఆగిపోయిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ నుంచి మొదలుపెడతారా? అనేది చూడాలి. లీగ్ లో 12 లీగ్ మ్యాచ్ లు, మూడు ప్లేఆఫ్స్, ఫైనల్ మిగిలి ఉంది. ఐపీఎల్ వాయిదాతో కొందరు విదేశీ ఆటగాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు. వారందరినీ వెనక్కు పిలిచే చాన్సుంది. ఇక అహ్మదాబాద్ లో మూడు, లక్నో, బెంగళూరులో 2, చెన్నై, ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, ధర్మశాలలో ఒక్కో మ్యాచ్ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల రీత్యా ధర్మశాలలో మ్యాచ్ ను నిర్వహించడం కష్టమే. మిగతా వేదికల్లో నిర్వహణకు అభ్యంతరాలు లేవు. 8వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు మ్యాచ్ లు ఆగిపోయాయి. వీటిని నిర్వహిస్తే లీగ్ మరికొన్ని రోజులు పొడిగించాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మే 25న ఫైనల్ జరగాల్సి ఉంది. ఇప్పుడు అది జూన్ 1కి మారుతుందేమో? అంతా బీసీసీఐ నుంచి అప్ డేట్ పై ఆధారపడి ఉంది.
15 నుంచి ఐపీఎల్ లీగ్ మళ్లీ మొదలు ?
May 11, 2025
0
Tags