దేశీయ మార్కెట్ టాటా మోటార్స్ మే 22న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌కు ముందు పరీక్షిస్తున్నారు. ఈ కారు ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం, ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల లోనావాలా సమీపంలోని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై పరీక్షిస్తున్నట్లు కనిపించింది. అయితే ఈ యూనిట్లు బాగా కవర్ చేసి ఉన్నాయి. దీని కారణంగా ఎక్స్‌టీరియర్ సమాచారం బయటకురాలేదు. ఇందులో కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, కొత్త బంపర్లు, వెనుక భాగంలో కనెక్ట్ చేసిన టెయిల్ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కొత్త ఇంటీరియర్స్, కొత్త స్టీరింగ్ వీల్, ఇల్యూమినేటెడ్ లోగో, కొత్త ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. పాత వెర్షన్‌లో ఉన్న అదే ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తారు. ఫేస్‌లిఫ్ట్‌లో 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు మాత్రమే అందిస్తారు.టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో రానుంది. ఈ విభాగంలో ఇది మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ i20 వంటి కార్లతో పోటీ పడనుంది. ధర పరంగా, ఇది మారుతి సుజుకి బ్రెజ్జా, ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, సైరోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, స్కోడా కైలాక్ వంటి అనేక కాంపాక్ట్ ఎస్‌యూవీల నుండి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.
మే 22న టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల
May 11, 2025
0
Tags