అధునాతన ఫీచర్లతో లావా యువ 2 స్టార్ విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో లావా అధునాతన ఫీచర్లతో యువ 2 స్టార్ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6,499 కాగా, బ్లోట్‌వేర్‌ లేని అనుభవం, Android 14 Go వంటి లైట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్, పెద్ద RAM, శక్తివంతమైన బ్యాటరీతో ఇది ఆకట్టుకుంటోంది. ఇప్పటికే Xiaomi, Realme, Infinix వంటి బ్రాండ్‌లు తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే లావా యువ స్టార్ 2 ఆకర్షణీయ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ చేయడంతో పోటీ మరింత పెరిగింది. ఈ ఫోన్ ఒక సాధారణ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది సినిమాలు, వీడియోలు, గేమింగ్ కోసం మంచి వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. కెమెరా విషయంలో ఇది రోజువారీ ఫోటోగ్రఫీ కోసం ఒక రియర్, ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ధరకే 8GB RAM అందించడం మంచి విషయం. శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ UNISOC ప్రాసెసర్‌తో లభిస్తుంది. ఇది మీ రోజువారీ పనులైన కాల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్‌కు సరిపోయే పనితీరును అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)