తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ సంఘాల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపంగా మారాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ''భారాస పార్టీని, మమ్మల్ని ఎన్ని తిట్టినా భరించాం.. భరిస్తాం. తెలంగాణ ప్రతిష్ఠ దెబ్బతినేలా సీఎం మాట్లాడితే సహించేది లేదు. రేవంత్‌రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని సీఎం అని నిన్నటి వ్యాఖ్యలతో తేలిపోయింది. దిల్లీ పార్టీలను నమ్మొద్దని ప్రజలకు కేసీఆర్ చిలుకకు చెప్పినట్లు చెప్పారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షరసత్యాలయ్యాయి. పరిపాలన చేతగాదని.. సీఎం రేవంత్‌రెడ్డి కాడి కిందపడేశారు'' అని కేటీఆర్ విమర్శించారు.
రేవంత్‌రెడ్డి అత్యంత అసమర్థ, దక్షతలేని సీఎం : కేటీఆర్
May 06, 2025
0
Tags