ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఈ నెల 16వ తేదీన అక్కడ భూమి కంపించింది. ఇటీవలే మయన్మార్, థాయ్‌లాండ్‌లల్లో సంభవించిన భూకంపాలు మిగిల్చిన విషాదాన్ని ఇంకా విస్మరించకముందే భూమి ప్రకంపించడం ఉలిక్కిపడేలా చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల పాకిస్తాన్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. దీని తీవ్రత ఇటు భారత్‌పైనా పడింది. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో తేలికపాటి ప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంపం వల్ల వల్ల ప్రాణ, ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు. కొన్ని ప్రాంతాల్లో నివాసాలు బీటలు వారినట్లు వార్తలు అందుతున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా రికార్డయింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:17 నిమిషాలకు ఆఫ్ఘనిస్తాన్ 36.10 ఉత్తర అక్షాంశం, 71.20 తూర్పు రేఖాంశ వద్ద భూమి కంపించింది. ఉపరితలం నుంచి 130 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. రాజధాని కాబుల్‌కు ఈశాన్య దిశగా ఉన్న బదాక్షన్ ప్రావిన్స్ పరిధిలోని మాఘ్ నువుల్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం ?
April 19, 2025
0
Tags