భారత దేశ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసి కోట్ల మందికి చేరువైపోయింది. ఇప్పుడు యూపీఐ చెల్లింపుల కారణంగా చాలా మంది ఫిజికల్ గా క్యాష్ తీసుకెళ్లడం మానేశారు. జేబులో రూపాయి చిల్లర లేకపోయినా మొబైల్ ఉంటే దేశం మొత్తం తిరిగి రావచ్చు. భారత ఆర్థిక రంగం రూపురేఖలు మార్చేసిన యూపీఐపై జీఎస్టీ వేస్తారని చాలా కాలం నుంచి వినిపిస్తన్న మాట. కార్డు పేమెంట్స్ చేసేటప్పుడు జరిగే లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ పేరుతో నగదు తీసుకుంటున్నాయి. అందుకే తర్వాత యూపీఐ పేమెంట్స్ పై ఆర్బీఐ పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. 2000లకు మించిన చెల్లింపులు చేస్తే 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారని కథనాలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలను ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. యూపీఐ పేమెంట్స్పై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని తేల్చి చెప్పింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. దేశంలో యూపీఐ పేమెంట్స్ ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది.
యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ ?
April 19, 2025
0
Tags