ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కాం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. మిథున్ రెడ్డి తరపున వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకూ మిథన్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి సమాచారం మేరకు ఎంపీ మిథున్ రెడ్డి విచారించేందుకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. కానీ మిథున్ రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకూ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దు : సుప్రీంకోర్టు
April 07, 2025
0
Tags