మహారాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ నుంచి 100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించిందని 'టాటా పవర్' ఈ రోజు తెలిపింది. రాబోయే రెండు సంవత్సరాలలో ముంబైలోని పది వ్యూహాత్మకంగా ఉన్న ప్రదేశాలలో ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. అధునాతన 'బ్లాక్ స్టార్ట్' కార్యాచరణతో కూడిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్..గ్రిడ్‌లో అవాంతరాలు సంభవించినప్పుడు మెట్రో, ఆసుపత్రులు, విమానాశ్రయం, డేటా సెంటర్‌లతో సహా కీలకమైన మౌలిక సదుపాయాలకు విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ వ్యవస్థ పీక్ అవర్స్‌లో డిమాండ్‌కు అనుగుణంగా నగర విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. మొత్తం 100 మెగావాట్ల వ్యవస్థను ముంబైలో వ్యూహాత్మకంగా ఉన్న 10 ప్రదేశాలలో ఏర్పాటు చేయడమే కాకుండా..లోడ్ కేంద్రాల దగ్గర, టాటా పవర్‌కు సంబంధించిన పవర్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా పర్యవేక్షణ, నియంత్రణ కలిగి ఉంటుంది. టాటా పవర్ ఒక ప్రముఖ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ. ఇది 15.60 GW సామర్థ్యంతో వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.
టాటా వంద మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఆమోదం !
April 07, 2025
0
Tags