హెచ్‌సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హెచ్ సీయూ విద్యార్థులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కంచ భూముల్ని అభివృద్ధి పేరుతో విక్రయిస్తే ఊరుకోబోమంటూ తెలంగాణ సర్కారును హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలను కొన్ని రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదయ్యాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఈరోజు స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది. హెచ్ సీయూ కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సెక్రటేరియట్ లోసమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు పలు విజ్ఞప్తులు చేశారు. ఇందులో విద్యార్థులపై కేసులతో పాటు యూనివర్శిటీ క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.
హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం !
April 07, 2025
0
Tags