ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు పిలుపుతో రాధాతో భేటీకి ప్రాధ్యానత చోటు చేసుకుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాధాకు సీటు దక్కుందని అంతా భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. దీంతో రాధా అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పోస్టుల్లోనైనా వంగవీటి రాధాకు పదవి దక్కుతుందేమోనని అనుచరులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాధాకు చంద్రబాబు నుంచి పిలుపురావడం, వెంటనే వెళ్లడం వంటి పరిణామాలు జరగడం వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కాగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వంగవీటి.. అప్పటి నుంచి కూడా టీడీపీలో కొనసాగుతున్నారు. జగన్ హయాంలో వైసీపీలోకి తీసుకునేందుకు వంగవీటి రాధాని ఆ పార్టీ నేతలు కొడాలి, వంశీ ప్రయత్నం చేసినా ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో రాధాకు ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ఆయన అనుచరులు అనుకున్నారు. కానీ నిరాశ మిగిలింది. అయినా సరే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏదో ఒక పదవి వస్తుందిలే అనుకున్నారు. కానీ పదవులు దక్కులేదు. అయినా సరే తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీలో రాధాకు అవకాశం దక్కుందని భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడుతో వంగవీటి రాధా భేటీ !
April 03, 2025
0
Tags