జపాన్ లో భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు

Telugu Lo Computer
0

పాన్ లోని క్యుషు కేంద్రంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదు అయ్యింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ భూకంపం గురించి జపాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హెచ్చరికలు వచ్చిన కొద్ది గంటలకే భూమి కంపించడంతో జపాన్ ప్రజల్లో ఒకింత వణుకు మొదలైంది. జపాన్ ప్రభుత్వం ఇప్పటికే దేశంలో భారీ భూకంపం సంభవించనుందని, ఇది జపాన్ దేశ జనాభాలో 1 శాతం జనాభాను తుడిచిపెట్టుకొని పోతుందని తెలిపింది. జపాన్ ప్రభుత్వ నివేదిక ప్రకారం నంకై ట్రప్ వద్ద సముద్ర గర్భంలో 8 నుంచి 9 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం 80 శాతం ఉందని తెలిపింది. అంతేగాక దీని ద్వారా వచ్చే సునామీల వల్ల దాదాపు 3లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని చెప్పింది. ఇక జపాన్ క్యాబినేట్ ఆఫీస్  నివేదిక ప్రకారం 270.3 ట్రిలియన్ల ఆర్థిక నష్టం వాటిల్లవచ్చని వివరించింది. ఇక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, రోజు వారీ సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలని చెప్పింది. అంతేగాక ఆహారం, నీరు సేకరించడం, కుటుంబసభ్యుల తరలింపు ప్రణాళికలపై చర్చించి, సిద్దంగా ఉండాలని కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)