భారత భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం !

Telugu Lo Computer
0


భారత దేశ భద్రత మరియు ప్రాంతీయ స్థిరత్వానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే పేర్కొన్నారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోడీతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి హాని కలిగించే చర్యలకు తమ భూభాగాన్ని వినియోగించుకునేందుకు శ్రీలంక ఎప్పటికీ అనుమతించదని ఆయన పునరుద్ఘాటించారు. కీలక మైన సముద్ర భద్రత సమస్యపై ప్రధాని మోడీ మద్దతు కోరినట్లు తెలిపారు. టెక్నాలజీ మరియు పాలనలో సహకారానికి ఉన్న అవకాశాలను దిసనాయికె ఎత్తిచూపారు. వృద్ధి, ఆవిష్కరణ మరియు సామర్థ్యాన్ని పెంచడానికి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ప్రాముఖ్యతను గుర్తించిందని అన్నారు. ఈ చొరవను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రధాని మోడీ, తాను పలు డొమైన్‌లలో డిజిటలైజేషన్‌ సహకారంపై చర్చించామని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)