అమెరికా అధ్యక్షులు ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఆదివారం తిరస్కరించారు. అమెరికాతో చర్చలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. గత నెల అణుకార్యక్రమంపై ఇరాన్‌తో చర్చలకు సుముఖంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే దౌత్య చర్చలు విఫలమైతే ఇరాన్‌పై బాంబు దాడి చేస్తామని బెదిరించారు. గురువారం ట్రంప్ మరోసారి ఇరాన్‌తో ప్రత్యక్ష చర్చలు జరుపుతానని ప్రకటించారు. ఐరాస హక్కులను ఉల్లంఘిస్తూ నిరంతరం దాడి చేస్తామని బెదిరించే, వివిధ అధికారుల నుండి విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్త పరిచే ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలు అర్థరహితమని అరాగ్చీ పేర్కొన్నారు. తాము దౌత్యానికి కట్టుబడి ఉన్నామని, పరోక్ష చర్చల మార్గానికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
అమెరికాతో చర్చలకు తిరస్కరించిన ఇరాన్
April 06, 2025
0
Tags