యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన భారత్‌ !

Telugu Lo Computer
0


రేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను భారత్ పరీక్షించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో సన్నద్ధతను పరీక్షించుకునేందుకు వీటిని ప్రయోగించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధమని ప్రకటించింది. మూడ్రోజుల క్రితమే భారత్‌ ఇదే సముద్రంలో మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఏఎం)తో సీ స్కిమ్మింగ్‌ పరీక్షను నిర్వహించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)