3-డోర్ థార్ మోడల్‌లో కొన్ని వేరియంట్లను నిలిపివేత !

Telugu Lo Computer
0


హీంద్రా నుంచి గతంలో విడుదలైన ఆఫ్‌రోడ్ కింగ్ థార్ దేశీయంగా మంచి ప్రజాధారణ సంపాదించింది. మొదట్లో మూడు డోర్ థార్‌ను విడుదల చేసిన కంపెనీ ఈ ఆ తరువాత పెరుగుతున్న వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ ప్రయాణాలకు సైతం అనువుగా ఉండేలా ఐదు డోర్ థార్‌ను తీసుకువచ్చి తన కస్టమర్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. బలమైన బాడీ రూపం, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, అన్ని రకాల రోడ్లపై కూడా దూసుకుపోయేలా పెర్ఫామెన్స్ కారణంగా గత ఏడాది అత్యుత్తమ కార్ల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం మహీంద్రా మూడు-డోర్ల థార్, ఐదు-డోర్ల థార్ రాక్స్‌ను కలిపి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ రెండింటి ద్వారా కంపెనీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తాజాగా మహీంద్రా తన 3-డోర్ థార్ మోడల్‌లో ఉన్న కొన్ని వేరియంట్లను నిలిపివేసింది. అయితే, దీనిని పూర్తి స్థాయిలో మార్కెట్ నుంచి తొలగించలేదు. కేవలం కొన్ని నిర్దిష్ట వేరియంట్లను మాత్రమే ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు థార్ 3-డోర్ మొత్తం 19 వేరియంట్లలో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు, కేవలం 11 వేరియంట్లే కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నాయి. గల కొంత కాలంగా తక్కువ అమ్మకాలను నమోదు చేస్తున్న ఎనిమిది వేరియంట్లను మార్కెట్ నుండి ఉపసంహరించాలనే నిర్ణయానికి వచ్చింది. కంపెనీ దృష్టి ఇప్పుడు మధ్యస్థ, టాప్ వేరియంట్లపై స్పష్టంగా కేంద్రీకరించబడింది. ఈ క్రమంలో, కొన్ని అధిక ధరలు ఉన్న మోడళ్లను దశలవారీగా లైనప్ నుంచి తొలగించడం జరిగింది. దీనిలో భాగంగా, AX (O) 4WD కన్వర్టిబుల్ వేరియంట్‌ను తొలగించారు. అలాగే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన LX AT 4WD కన్వర్టిబుల్ వేరియంట్‌లను నిలిపివేశారు. వీటితో పాటు, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లభించే AX (O) 4WD కన్వర్టిబుల్, 4WD హార్డ్ టాప్, LX 4WD కన్వర్టిబుల్, 4WD హార్డ్ టాప్ OD వేరియంట్లకు కూడా గుడ్‌బై చెప్పేశారు. ఇంకా, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడిన LX AT 4WD హార్డ్ టాప్ OD కనిపించదు. LX AT 4WD కన్వర్టిబుల్ వేరియంట్లను కూడా మళ్లీ చూడలేం. మహీంద్రా తీసుకున్న తాజా నిర్ణయం వారి వ్యూహాత్మక ప్రణాళికలో ఒక భాగంగా తెలుస్తుంది. మరింతగా ప్రజాదరణ పొందిన మోడళ్లపై దృష్టి కేంద్రీకరించడమే లక్ష్యం అని దీనర్థం. కొన్ని మోడళ్లను నిలిపివేసినప్పటికి థార్ లవర్స్‌కు ఇష్టమైన మరిన్ని అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం థార్ మోడళ్ల ధరలు భారతదేశంలో ఎక్స్-షోరూమ్ రూ.11.50 లక్షల నుండి రూ.17.60 లక్షల వరకు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)