వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అమలుపై స్టేటస్ కో విధించిన సుప్రీంకోర్టు !

Telugu Lo Computer
0


రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తాము మళ్లీ ఆదేశాలు ఇచ్చేంత వరకు అమలు చేయవద్దని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ బిల్లుపై నిన్న వాదనలు జరగగా, నేడు దానిపై మరోసారి ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు పలు వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ బిల్లు అమలుపై స్టేటస్ కో విధించింది.కొన్ని విషయాలపై వివరణ నేడు ఇవ్వవలసిందిగా కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే తమకు వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువు కావాలని అటార్నీజనరల్ కోరారు. ఈ వారం రోజులలో బిల్లు అమలు చేయకపోవడం వల్ల ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన పేర్కొన్నారు. కొత్త చట్ట ప్రకారం వక్ఫో బోర్డులో కొత్త సభ్యులను నియమించబోమని ఆయన సుప్రీంకోర్టుకు విన్నవించారు. దీనిపై న్యాయమూర్తులు మాట్లాడుతూ తామ తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు ఒక్క వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోద్దని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న వక్ఫ్ బోర్టు కమిటీలనే యదాతధంగా కొనసాగించాలని స్పష్టం చేసింది.. కొత్త చట్టం పేరుతో ఒక్క వక్ఫ్ ఆస్తీని సైతం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోకూడదని న్యాయమూర్తులు ఆదేశించారు.. కొత్త చట్టంపై ఇప్పటికే 73 పిటిషన్ లు దాఖలయ్యాయని , వాటన్నింటి క్రమ పద్దతిలోనే విచారిస్తామని తెలిపారు.. ప్రస్తుతం వక్ప్ చట్టంపై యదాస్థితిని కొనసాగించాలని, అంతకు మించి ముందుకువెళ్లవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 5వ తేది వరకు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)