తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో నివాసముంటున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలానికి చెందిన కె.చేతన్ రెడ్డి (26) నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య బిందు. మొయినాబాద్‌లోని భాస్కర లా కళాశాలలో గురువారం ఆమెతో పరీక్షలు రాయించి తిరిగి ఇబ్రహీంపట్నానికి బైక్‌పై బయలుదేరారు. పెద్ద షాపూర్ రైల్వేట్రాక్‌కు సమీపంలో రహదారి పక్కనే ఉన్న ఓ తోటలో విరగగాసిన మామిడి కాయలను చూసిన చేతన్‌రెడ్డి వాహనాన్ని నిలిపి, తోటలోని మామిడి కాయలు కోసుకు వస్తుండగా, చెట్టు పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్‌ఫార్మర్ తీగలు తగలడంతో చేతన్‌రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భర్త అచేతనగా పడి ఉండటాన్ని చూసిన బిందు అరవడంతో స్థానికులు వచ్చి అతడిని పక్కకు జరిపారు. సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన శంషాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మామిడి తోటలో ట్రాన్‌ఫార్మర్ తీగలు తగిలి దుర్మరణం చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి !
April 18, 2025
0
Tags