వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అన్నారు. వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉండే వారిపై బురద చల్లాలనే ఉద్దేశ్యంతో ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. సిట్ కావాలనే ఇదంతా చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గుడులు, బడుల దగ్గర బెల్ట్ షాపులు పెరిగాయని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారన్నారు. నేరుగా టీడీపీ ఎమ్మెల్యేనే కూటమి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేసిన పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. సిట్ విచారణ గత ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాలపై కాదు, కూటమి ప్రభుత్వంలో లిక్కర్ వ్యాపారంపై చేయాలని డిమాండ్ చేశారు.
సాయిరెడ్డి టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు : కోరుముట్ల శ్రీనివాస్
April 19, 2025
0
Tags