ఇన్ఫోసిస్ ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయని 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగులను తాజాగా తొలగించింది. మనీకంట్రోల్ ప్రకారం ఏప్రిల్ 18న అంటే ఇవాళ ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌ల ద్వారా కంపెనీ ఈ విషయాన్నీ తెలియజేసింది. అయితే గత నెల ఫిబ్రవరి 2025లో కూడా కంపెనీ ఇదే విధమైన తొలగింపుల చేసింది, అప్పుడు కూడా ఇలాంటి కారణంతోనే 300 మందికి పైగా ట్రైనీలను ఇంటికి పంపించేసింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్ఫోసిస్ అప్‌గ్రాడ్ అండ్ ఐటీ ట్రైనింగ్ కోసం నిట్ ద్వారా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కోసం ఫ్రీ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను అందించింది. ఉద్యోగులకు ఎక్కువ సమయం, డౌట్ రేషియో సెషన్‌లతో జెనరిక్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించడానికి మూడు అవకాశాలు కల్పించామని, కానీ వారు అవసరమైన ప్రమాణాలను అందుకోలేదు. అందువల్ల వీరు అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం కొనసాగించలేకపోతున్నట్లు తెలిపింది. ఇన్ఫోసిస్ ఈ ఉద్యోగులకు ప్రొఫెషనల్ అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు ఇంకా ఇన్ఫోసిస్ అందిస్తున్న ఎక్స్టెర్నల్ ట్రైనింగ్ అందించడం ద్వారా సహాయం చేయనుంది. అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ పై ఆసక్తి ఉన్నవారు ప్రత్యేక శిక్షణ తీసుకొని ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు తిరిగి అప్లయ్ చేసుకోవచ్చు. ITలో కొనసాగాలనుకునే ఇతరులు కూడా ఉచిత ఐటీ శిక్షణలో పాల్గొనవచ్చు. శిక్షణతో పాటు ఇన్ఫోసిస్ తొలగించిన ఉద్యోగులకు మైసూర్‌లోని ట్రైనింగ్ సెంటర్ నుండి ఇంటికి వెళ్ళడానికి ఒక నెల జీతం, వసతి ఇంకా ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తోంది. 21 అక్టోబర్ 2024న ఇన్ఫోసిస్‌లో చేరిన దాదాపు 730 మంది ట్రైనీలు 17 ఏప్రిల్ 2025న ఫైనల్ అసెస్మెంట్ పూర్తి చేసారు. నెక్స్ట్ ట్రైనీల బృందం ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉంది. అయితే గత నెల మార్చిలో కంపెనీ కూడా ఇలాంటి కారణాల వల్ల మైసూర్ క్యాంపస్‌లో 30-45 మంది ట్రైనీలను తొలగించింది. ఆ సమయంలో ఈ తొలగింపులు పెద్ద దుమారం రేపింది. ఈ ట్రైనీలకు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ కోసం రెడీ కావడానికి 12 వారాల శిక్షణా ప్రోగ్రాం కూడా అందించారు. ఈ ఉద్యోగులలో చాలా మందిని సిస్టమ్ ఇంజనీర్లు, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్లుగా నియమించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, క్లయింట్ల ఖర్చు తగ్గడం వల్ల ఇన్ఫోసిస్‌లో చేరడానికి రెండు సంవత్సరాలకు పైగా వీరు వేచి ఉన్నారు. అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో డిమాండ్ మందగించినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించింది.
ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయని 240 మంది ఎంట్రీ-లెవల్ ఉద్యోగుల తొలగింపు !
April 18, 2025
0
Tags