కర్నాటక రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృతి !

Telugu Lo Computer
0

ర్నాటకలో బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన మేరకు ఆంధ్రప్రదేశ్‌ లోని అనంతపురం జిల్లా హిందూపురం వాసులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లారు. యాద్గిర్‌ జిల్లాలోని షాపూర్‌  వైపు వెళ్తుండగా మార్గం మధ్యలో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయి  దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్‌ సమీపంలోని వంతెనను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను నాగరాజు, సోమ, నాగభూషణ్‌, మురళిగా గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్‌ ఆనంద్‌ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గబ్బూర్‌ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)