అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితుల్లో విదేశీ విద్యార్థులు వణికిపోతున్నారు. ఈనేపథ్యంలో ఓ కథనం ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి నోటీసులు అందుకున్నా సరే వీసా రద్దు వంటి కఠిన శిక్ష ఎదురవుతున్నట్లు పేర్కొంది. భారత్ సహా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని పలు అమెరికా కళాశాలలు పేర్కొన్నాయి. వారిలో చాలామందికి క్యాంపస్‌లలో జరుగుతోన్న పాలస్తీనా అనుకూల ఆందోళనతో ఎలాంటి సంబంధం లేదు. గతంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణం చూపించి వీసాలను అధికారులు రద్దు చేసినట్లు మీడియా కథనం పేర్కొంది.
అమెరికాలో వేగంగా వాహనం నడిపినా వీసా రద్దు ?
April 08, 2025
0
Tags