తమిళనాడు గవర్నర్‌కి సుప్రీంకోర్టు చీవాట్లు !

Telugu Lo Computer
0


మిళనాడు గవర్నర్‌ పది కీలక బిల్లులను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధమని మంగళవారం జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్‌ ఆమోదాన్ని నిలిపివేసిన తర్వాత రాష్ట్రపతికి బిల్లులను రిజర్వ్‌ చేయలేరని పేర్కొంది. "రాష్ట్రపతికి 10 బిల్లులను రిజర్వ్‌ చేయాలన్న గవర్నర్‌ చర్య చట్ట విరుద్ధం, ఏకపక్షం. ఈ చర్యను తోసిపుచ్చాం. ఈ బిల్లులను గవర్నర్‌కు తిరిగి సమర్పించిన తేదీ నుండి ఆమోదం పొందినట్లు పరిగణించబడుతుంది" అని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)