హమ్‌దార్ద్ పానీయం విషయంలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కొన్ని రోజుల క్రితం హమ్‌దార్ద్ షర్బత్ గురించి రామ్‌దేవ్ బాబా పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. దానిని కొనుగోలు చేయడం వల్ల వచ్చే లాభాలను కంపెనీ వేరొక వర్గానికి చెందిన నిర్మాణాలు చేపట్టేందుకు ఉపయోగిస్తోందన్నారు. ''అదే ఈ షర్బత్ (పతంజలి సంస్థకు చెందిన పానీయం) తాగితే గురుకులాలను నిర్మించవచ్చు. పతంజలి విశ్వవిద్యాలయాన్ని విస్తరించవచ్చు'' అంటూ రామ్‌దేవ్ మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో వివాదాస్పదమైంది. ఈ క్రమంలో హమ్‌దార్ద్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వెంటనే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. హమ్‌దార్ద్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్పత్తిని అగౌరవపరచడం కంటే తీవ్రమైందని, అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందికే వస్తాయని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ''ఈ వ్యాఖ్యలు కోర్టు అంతరాత్మను షాక్‌కు గురిచేశాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదు'' అని తీవ్రంగా స్పందించింది.
హమ్‌దార్ద్ పై రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావు !
April 22, 2025
0
Tags