పార్లమెంటు ప్రజాస్వామ్యం అత్యున్నతమైనదని, దానిని మించిన అధికారం లేదని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ మంగళవారం అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. న్యాయవ్యవస్థ హద్దులు మించిన చర్యలపై ఆయన మళ్లీ ప్రస్తావించారు. పార్లమెంటు అత్యున్నత స్థానం కలిగిన సంస్థ అని. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే రాజ్యాంగ రూపురేఖలను నిర్ణయించే హక్కును కలిగి ఉంటారని తెలిపారు. రాజ్యాంగంపై వారికే తుది హక్కు ఉంటుందన్నారు. ఎవ్వరూ దానికంటే పై స్థాయిలో ఉండలేరని జగదీప్ ధన్‌ఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
దేశానికి పార్లమెంటే అత్యున్నతం : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్
April 22, 2025
0
Tags