ప్రధాని మోడీకి పవిత్ర బౌద్ధ గ్రంథం ది వరల్డ్ టిపిటక సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్ ప్రదానం

Telugu Lo Computer
0

రోవ బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.అనంతరం బ్యాంకాక్‌లో థాయ్‌ రామాయణాన్ని మోడీ తిలకించారు. భారత్‌ - థాయ్‌లాండ్‌ మధ్య ఎన్నో శతాబ్ధాల అనుబంధం ఉందని , దీనికి రామాయణమే నిదర్శనమన్నారు. రామాయణాన్ని ప్రదర్శించిన కళాకారులను ప్రశంసించారు. ఈ సందర్భంగా థాయ్ ప్రధానమంత్రి "ది వరల్డ్ టిపిటక   సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్"ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక దౌత్యం ముఖ్యమైన భాగస్వామ్యానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి థాయ్ ప్రధానమంత్రి పేటోంగ్టార్న్ షినవత్ర.. పవిత్ర గ్రంథం "ది వరల్డ్ టిపిటక: సజ్ఝాయ ఫొనెటిక్ ఎడిషన్"ను ప్రదానం చేశారు. టిపిటక (పాలీలో) లేదా త్రిపిటక (సంస్కృతంలో) అనేది 108 సంపుటాలతో కూడిన బుద్ధుని బోధనల సంకలనం. ఇది ప్రధాన బౌద్ధ గ్రంథంగా పరిగణిస్తారు. ఇది తొమ్మిది మిలియన్లకు పైగా అక్షరాల ఖచ్చితమైన ఉచ్చారణను నిర్ధారిస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను 2016లో రాజు భూమిబోల్ అదుల్యదేజ్ (రామ IX), రాణి సిరికిట్ 70 సంవత్సరాల పాలనను స్మరించుకునేందుకు థాయ్ ప్రభుత్వం వరల్డ్ టిపిటక ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రచురించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)