ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు తీవ్ర నిర్ణయాలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)