రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6 శాతానికి తగ్గింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఈఎంఐ చెల్లింపుదారులపై భారం తగ్గనుంది. ఎంపీసీ పాలసీ నిర్ణయాల ప్రకటన సమయంలో రిజర్వు బ్యాంక్ గవర్నల్ ఈ ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మెుదటి సారి రిజర్వు బ్యాంక్ సమావేశం నిర్వహిస్తుండగా.. సంజయ్ మల్హోత్రా రిజర్వు బ్యాంక్ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండవ సమావేశం కావటం గమనార్హం. మల్హోత్రా తన మెుదటి సమావేశంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించారు. ప్రపంచ సెంట్రల్ బ్యాంకులకు భిన్నంగా గత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రేట్ల తగ్గింపును సాగతీతతో దేశంలో వినియోగం పడిపోయి వృద్ధి రేటు కనిష్ఠాలకు పడిపోయిన వేళ ఆయనను కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే.
రెపో రేటు 25 పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ
April 09, 2025
0
Tags