తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు కుమారి అనంతన్ (93) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆరోగ్యం విషమించడంతో అనంతన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తన తండ్రి మృతి నేపథ్యంలో తమిళిసై కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో తమిళిసైని వారు బంధువులు, పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. తమిళిసై నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనంతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి కన్నుమూత
April 09, 2025
0
Tags