స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నోప్రపంచంలోనే తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్ టెక్నో మెగాబుక్ S14 పేరుతో విడుదల చేసింది. టెక్నో మెగాబుక్ S14 ల్యాప్‌టాప్ ప్రపంచంలోనే తక్కువ బరువు కలిగిన 14 అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి, బరువు కేవలం 898 గ్రాములు వుంది. ‘బ్యాక్లిట్’ కీ బోర్డు సపోర్టుతో ఈ ల్యాప్‌ట్యాప్ ఆకట్టుకుంటోంది. 14 అంగుళాల 2.8k OLED డిస్‌ప్లే, 2800×1600 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్, 440 నిట్స్ బ్రైట్‌నెస్, 91 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ఉన్నాయి. ఇది విండోస్ 11 OS తో పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 12 కోర్ స్నాప్‌డ్రాగన్ X Elite చిప్, Intel Core Ultra 7 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇక ఇందులో స్టోరేజ్ కూడా భారీగానే ఉంది. ఇందులో 32GB LPDDR5 ర్యామ్, 2TB SSD స్టోరేజీ కలిగి ఉండడంతో వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 2MP కెమెరా, రెండు 2W స్టీరియో స్పీకర్లను అందించారు. ఇందులో 50Wh కెపాసిటి కలిగిన బ్యాటరీని అమర్చారు. దీనికి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 16 గంటల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నో మెగాబుక్ S14 లో Ella AI అసిస్టెంట్ తో పాటు AI PPT జనరేటర్, AI మీటింగ్ అసిస్టెంట్, AI డ్రాయింగ్ సర్వీస్ వంటి అదనపు ఫీచర్లను కూడా అందించారు. అలాగే దీని కనెక్టివిటీ పరంగా చూస్తే.. బ్లూటూత్ 5.4, వైఫై 6E, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
అతి తక్కువ బరువున్న ల్యాప్‌ట్యాప్ టెక్నో మెగాబుక్ S14 విడుదల !
March 06, 2025
0
Tags