'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా కేసు విచారణపై హైకోర్టు స్టే !

Telugu Lo Computer
0


'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాపై వచ్చిన ఫిర్యాదులతో గుంటూరు సీఐడీ అధికారులు మార్చి 5న విచారణకు రావాలని వర్మకు నోటీసులు జారీ చేశారు.  సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ  రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించగా, నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2019 లో తెరకెక్కిన సినిమాపై 2024లో కేసులు నమోదు అవ్వడం ఏంటనీ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో రామ్ గోపాల్ వర్మకు కాస్తా ఉపశమనం లభించింది. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనే చేశారని, దీన్ని కొట్టేయాలని రామ్ గోపాల్ వర్మ హై కోర్టును ఆశ్రయించడం జరిగింది. 2019 లో తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)