వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు 200కు పెంపు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు 200కు పెంచినట్టు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన 'మనమిత్ర' అనతి కాలంలోనే 200 సేవలు అందించే అద్భుతమైన మైలురాయి సాధించిందన్నారు. ఏపీలో డిజిటల్‌ గవర్నెన్స్‌ శక్తికి ఇదో నిదర్శనమని చెప్పారు. పౌర సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు సౌలభ్యం, పారదర్శకతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. సామాన్యుల ప్రయోజనం కోసం పౌర, కేంద్రీకృత సేవలను తాము విస్తరిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మన మిత్ర కోసం 955 2300 009కు సందేశం పంపాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)