ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భోగాపురం విమానాశ్రయానికి రహదారులపై చర్చ సందర్భంగా ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ అంశంపై సభ్యులు గంటా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడారు. సమస్యల్ని మంత్రి నారాయణ దృష్టికి తెచ్చారు. వాటిపై మంత్రి స్పందిస్తూ సమస్యల్ని చర్చిస్తామని తెలపగా దానికి స్పీకర్ స్పందిస్తూ గంటా శ్రీనివాస్‌ను చూపిస్తూ మీరూ, మీరూ వియ్యంకులు. మంత్రి నారాయణతో మాట్లాడొచ్చు కదా? అని చమత్కరించారు. అంతకుముందు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం పూర్తయినా మెట్రో పూర్తయ్యే వరకు ప్రస్తుత విశాఖ విమానాశ్రయాన్ని తెరిచే ఉంచాలని, అందుకోసం ఉద్యమం చేయాలని ప్రజలు తనను కోరుతున్నారని సరదాగా చెప్పారు. కానీ, మేం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఉద్యమం చేయకూడదని వారికి చెప్పానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన స్పీకర్ మనం ఉమ్మడిగా ఉన్నాం. ఉద్యమాలు చేయడానికి వీలు లేదంటూ పేర్కొన్నారు.
మీరూ, మీరూ వియ్యంకులు. మంత్రి నారాయణతో మాట్లాడొచ్చు కదా?
March 06, 2025
0
Tags