ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన రాజోలు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి కాసు శ్రీనివాస్, భవానీ దంపతుల కుమారుడు సుఖే్‌షకు రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శ్రీరంగనాయకితో వివాహం జరిగింది. అత్తామామలు తనను కన్న తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నారన్న అభిమానంతో అత్త భవానీ 50వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోడలు నిర్ణయించుకుంది. పుట్టినరోజు వేడుకల్లో అత్తకు పట్టుచీర, పసుపుకుంకుమ, గాజులు, మంగళసూత్రంతోపాటు వంద గ్రాముల బంగారు బిస్కెట్, రూ.28లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, 50లక్షల 50రూపాయల 50పైసల నగదు కలిపి మొత్తం రూ.కోటి విలువ చేసే బహుమతులను అందించి గోదారోళ్లు ఏం చేసినా ప్రత్యేకమేననన్నట్లుగా కోడలు తన ప్రేమను చాటుకుంది.
అత్త 50వ పుట్టిన రోజున రూ.కోటి విలువ చేసే బహుమతులు అందజేసిన కోడలు !
March 06, 2025
0
Tags