అప్పు తీర్చలేదని హత్య చేశారు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన అంజిబాబు అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేసేవాడు. వ్యాపార నిమిత్తం తనకు తెలిసిన వ్యక్తి సుభాని దగ్గర రూ. 12 లక్షలు వడ్డీకి తీసుకున్నాడు. తరువాత ఇచ్చిన బాకీ చెల్లించకుండా అంజిబాబు హైదరాబాద్​కు మకాం మార్చాడు.  ఇలా ఉండగా నాలుగు రోజుల క్రితం అంజిబాబు పిడుగురాళ్లలోని తన స్నేహితుల ఇంటికి వచ్చాడు.  అంజిబాబు పిడుగురాళ్లలో ఉన్నాడని సమాచారం అందుకున్న సుభాని, అతని స్నేహితులతో కలిసి పిడుగురాళ్ల వెళ్లాడు. అంజిబాబుని కారులో ఎక్కించుకుని మాచవరం మండలం నాగేశ్వరపురం తండాకి తీసుకెళ్లి అంజిబాబుకి మద్యం తాగించి దాడి చేసి, అనంతరం నోట్లో పురుగుల మందు పోశారు. ఆ సమయంలో అటువైపునకు స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు. గుంటూరులోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజిబాబు మృతి చెందాడు. ఈ ఘటనపై గురజాల డీఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)