ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బకాయిలు విడుదలకు ఆదేశాలు జారీ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రూ. 6,200 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో శుక్రవారం బకాయిలు వచ్చి చేరనున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం అడుగులు వేసింది. ఉద్యోగులకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిల విడుదలపై ఫోకస్ పెట్టింది. ఆర్థిక శాఖతో చర్చించింది. నిధులు విడుదలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పెండింగ్ బకాయిలు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)