అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్లలో గుబులు ?

Telugu Lo Computer
0


మెరికాలో గ్రీన్ కార్డులు కలిగిన వారు గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలకు గురవుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం నోట పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్, వెనక్కి పంపడం వంటి పదాలే తరచూ విన్పిస్తున్నాయి. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రవేశించకముందే అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు భయం పట్టుకుంది. అక్రమ వలసలకు ఆయన కళ్లెం వేస్తారని, తాత్కాలిక ఉద్యోగాలు చేసే వారి పైన, విద్యార్థి వీసాల పైన ఆంక్షలు పెడతారని వారు ఊహించారు. అయితే గ్రీన్ కార్డులు కలిగిన వారిని తనిఖీ చేస్తారని, ప్రశ్నల వర్షం కురిపిస్తారని చాలా మంది అనుకొని ఉండదు. అమెరికా పౌరసత్వం పొందడానికి గ్రీన్ కార్డు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇటీవలి కాలంలో గ్రీన్కార్డులు ఉన్న వారిని తనిఖీ చేయడం, స్వదేశాలకు తిప్పి పంపడం వంటి చర్యలు చేపడుతుండడంతో అమెరికాలో తమ హక్కులపై భారతీయులు సహా విదేశీయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ కార్డుల తనిఖీలు భారతీయులనే ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే 2023-24లో అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో భారతీయులది రెండోస్థానం. కొత్తగా అమెరికా పౌరసత్వం పొందిన వారిలో 6.1 శాతం మంది (49,700) మన దేశానికి చెందిన వారే. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నడుమ భారతీయులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)