ఆంధ్రప్రదేశ్ లో వైకాపా అయిదేళ్ల పాలనలో రూల్ ఆఫ్ లా నడిచిందని ఆ పార్టీ లీగల్ సెల్ నాయకుడు, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్లు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తే ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే వైకాపా నాయకులు వారికి సినిమా చూపిస్తారని హెచ్చరించారు. పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు తమ పార్టీ వారిని వేధిస్తూ తరిమేస్తున్నారని ఆరోపించారు. ఈపూరు మండలం బొమ్మరాజుపల్లెకు చెందిన నాగేశ్వరరావు ప్రభుత్వ పాలనపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తే అది నేరం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. అతణ్ని పోలీసులు తీసుకెళ్తే తాను హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంలో మహిళ హత్య కేసు ఏడాది దాటినా తేల్చని పోలీసులు తలదించుకోవాలని విమర్శించారు.
అధికార పార్టీ వాళ్లు ట్రైలర్ చూపిస్తే అధికారంలోకి రాగానే వైకాపా వారికి సినిమా చూపిస్తోంది ?
March 21, 2025
0
Tags