ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఓ దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ సైతం 22,400 మార్కుకు చేరువైంది. చివరికి 22,350కు చేరువలో ముగిసింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2 శాతం మేర రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 73,005.37 (క్రితం ముగింపు 72,989.93) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 73,933.80 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 740.30 పాయింట్ల లాభంతో 73,730.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 255.80 పాయింట్ల లాభంతో 22,338.45 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు మేర బలపడి 86.96 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో, మారుతీ సుజుకీ మినహా మిగిలిన అన్ని షేర్లూ లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.52 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా బంగారం ఔన్సు2929 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు !
March 05, 2025
0
Tags