ఢిల్లీ మహిళలకు మహిళా సమృద్ధి యోజన పథకం !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తీపి కబురు అందించింది. ఈ పథకం మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రారంభించనున్నారు. పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలందరూ అర్హులవుతారు. ప్రతినెలా రూ.2500 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పొందుతారు. మహిళా సమృద్ధి యోజన పథకాన్ని బిజెపి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది. ఢిల్లీలోని మహిళలకు ఈ పథకం వర్తించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ మనోజ్ తివారి మీడియాతో చెప్పారు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. వారి ఖాతాల్లో ప్రతి నెల రూ.2500 జమ అవుతాయి. ఈ పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రారంభించనున్నారు అని చెప్పారు. ఆధార్ కార్డు, ఢిల్లీ రెసిడెన్స్ సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయపు ధృవీకరణ పత్రం, ఆధార కార్డుతో లింక్ అయినా మొబైల్ నెంబర్. అయితే ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. వారి ఏడాది ఆదాయం మూడు లక్షల లోపు మాత్రమే ఉండాలి. మూడు లక్షలకు మించి ఉంటే ఈ పథకానికి అర్హులు కారు. వీరు ఢిల్లీ శాశ్వత నివాసి అయి ఉండాలి. ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు కాదు.

Post a Comment

0Comments

Post a Comment (0)