పెళ్లికి నిరాకరించిన యువతిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న యువకుడు !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బెల్గావి, నాథ్ పాయి సర్కిల్ వద్ద  ఐశ్వర్య మహేహ్ లోహర్ అనే అమ్మాయిని ప్రశాంత్ కుందేకర్ హత్య చేశాడు.  ఐశ్వర్యను ఏడాది కాలం నుంచి ప్రశాంత్ ప్రేమిస్తున్నాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ గతంలో ఓ సారి ఐశ్వర్య తల్లిని పెళ్లి గురించి ప్రస్తావించాడు. ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఆర్థికంగా స్థిరపడాలని బాధితురాలి తల్లి నిందితుడికి హితబోధ చేసింది. ఐశ్వర్య పిన్ని ఇంటికి విషం బాటిల్‌తో వెళ్లిన ప్రశాంత్‌, పెళ్లి చేసుకోవాలని ఆమెను వత్తిడి చేశాడు. ప్రశాంత్ అభ్యర్థనను ఆమె తిరస్కరించింది. విషం తాగేలా ఐశ్వర్యను వత్తిడి చేశాడు. కానీ ఆమె అడ్డుకున్నది. ఆ సమయంలో తన జేబులో ఉన్న కత్తిని తీసి ఐశ్వర్య గొంతు కోశాడు ప్రశాంత్‌. విపరీతంగా రక్త స్త్రావం కావడంతో ఐశ్వర్య మృతి చెందింది. ఆ తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకున్న ప్రశాంత్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి, సిటీ పోలీసు కమీషనర్ యాద మార్టిన్ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)