విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ఐఐటీ- గువాహటి ప్రణాళికలు చేస్తోంది. క్యాంపస్‌కు వచ్చే ఫ్రెషర్లకు మెడికల్ చెకప్ సహా ఫ్యాకల్టీతో మార్నింగ్ వాక్, కౌన్సెలింగ్ నిర్వహించాలని యోచిస్తోంది. గతంలో జరిగిన సెమిస్టర్ల సమయంలో కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఇనిస్టిట్యూట్‌కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ''విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడం, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలనేదే మా ఉద్దేశం. అందుకోసం ఇనిస్టిట్యూట్ సమగ్ర ప్రణాళిక చేస్తోంది'' అని డైరెక్టర్ దేవేంద్ర జలీహాల్ పేర్కొన్నారు. ''సెంటర్ ఫర్ హోలిస్టిక్ వెల్‌బీయింగ్ ద్వారా మానసిక ఆరోగ్యం కోసం కౌన్సిలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆర్మీ విశ్రాంత సిబ్బందిని ఇందులో భాగం చేస్తున్నాం. వీరితో విద్యార్థులు బెరుకు లేకుండా అన్ని విషయాలు పంచుకునే వీలు ఉంటుంది. వారి గోప్యతకు భంగం కలగకుండా ఈ సిబ్బంది నడుచుకుంటారు. కొత్తగా ఇనిస్టిట్యూట్‌కు వచ్చిన ఫ్రెషర్లు ఫ్యాకల్టీతో కలిసి మార్నింగ్ వాక్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తాం'' అని తెలిపారు.
ఫ్రెషర్లు ఫ్యాకల్టీతో కలిసి మార్నింగ్ వాక్ : విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి ఐఐటీ-గువాహటి ప్రణాళిక ?
March 13, 2025
0
Tags