మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటు (హౌస్ ఆఫ్ కామన్స్)లో ఈ అవార్డును చిరుకు అందజేయనున్నట్లు పేర్కొంది. యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా, ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్ షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేయనున్నారు.
చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం !
March 14, 2025
0
Tags